గాజులదిన్నె ప్రాజెక్ట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

IMG-20260401-WA0763

కర్నూలు, ఏప్రిల్ 1, (రిపబ్లిక్ న్యూస్):గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె ప్రాజెక్ట్ ను బుధవారం జిల్లా  కలెక్టర్ డా.ఏ.సిరి పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ప్రాజెక్ట్ వద్ద సాగు నీటి సరఫరా పరిస్థితులు, నీటి సామర్థ్యం పెంపు పనుల పురోగతి, జలాశయం నీటి నిల్వ స్థాయి, సాగు కాల్వల నిర్వహణ పనులు, మరమ్మత్తులు తదితర అంశాల గురించి అధికారులతో ఆరా తీశారు.గాజుల దిన్నె ప్రాజెక్ట్ కు సంబంధించి కోడుమూరు నియోజకవర్గంలో  కెనాల్స్ లైనింగ్,ఇతర మరమ్మతులకు  రూ.2.66 కోట్లు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి ఆమోదించారని కలెక్టర్ తెలిపారు.. ఎక్కడెక్కడ  ఈ పనులు చేపట్టాలి అనే అంశంపై కలెక్టర్ అధికారులతో చర్చించారు..ఇరిగేషన్ అధికారులు  బాగా పని చేసి రైతులకు సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో  గోనెగండ్ల తహసీల్దార్ రాజేశ్వరి, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts