రక్షక భ‌టులే భక్షకబటులు అయ్యారు

కర్నూలు ఫోర్‌తో టౌన్ ఇన్స్‌పెక్టర్ మధుసూదన్ గౌడ్ అరెస్ట్ ..

రక్షక భ‌టులే భక్షకబటులు అయ్యారు

లంచం ఇవ్వకపోతే 20 ఏళ్లు జైలు శిక్ష వేయిస్తానని బెదిరింపు..

తాజా కేసుల్లో కాక పాత కేసులో లంచం డిమాండ్..

రూ.80,000 లంచంతో పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్

b9a1c793-25fa-4023-8908-a70b1bfc287cకర్నూలు క్రైమ్ ప్రతినిధి, జూన్ 2, (రిపబ్లిక్ న్యూస్): కొత్త  కేసులలోనే కొందరు పోలీసులు లంచాలు అడుగుతారని తెలిసిందే.అయితే ఇక్కడ ఓ పోలీస్ అధికారి దాదాపుగా క్లోజ్ అయిన పాత కేసును రీ ఓపన్ చేస్తానంటూ పలుమార్లు బెదిరించి లంచం తీసుకున్నాడు.. లంచం ఇవ్వకపోతే ఆ పాత కేసులో 20 ఏళ్లు శిక్ష వేయిస్తానంటూ బెదిరించాడు.బాధితుడు కాళ్ల వీళ్ళ పడ్డ నేను ఏ తప్పు చేయలేదని ఎంత బ్రతిమాలిన కనికరించని సదరు పోలీస్ ఇన్స్పెక్టర్ లంచం కావాలంటూ పట్టుపట్టాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు లంచం ఇవ్వడంతో పాటు అతనికి సహకరించిన హెడ్ కానిస్టేబుల్ ను ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టించాడు. ఇది పోలీస్ వ్యవస్థలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు ఉదాహరణ.శాంతి భద్రతల విషయంలో పోలీసులు.బ్లాక్ మెయిలర్లను పట్టుకోవాల్సిన పోలీసులే.బ్లాక్ మెయిలర్లుగా మారి.. పాత విషయాలను అడ్డుపెట్టుకొని లంచం ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో గత సంవత్సరంలో దాదాపుగా క్లోజ్ అయిన ఒక కేసును రీ ఓపన్ చేస్తానంటూ బెదిరించి లంచం అడిగారు. ఆ వ్యవహారంలో ఏసీబీ అధికారులు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మధుసూదనగౌడ్, అతనికి సహకరించిన హెడ్ కానిస్టేబుల్ రవి లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు చెప్పిన వివరాలు బాధితుని కథనం మేరకు.. వివరాలు ఇలా ఉన్నా కర్నూలు నగరంలోని షరీన్ నగర్ ప్రాంతానికి చెందిన బెస్త రఘు అతని సోదరుడు రవికుమార్  నగర శివారులోని గుత్తి పెట్రోలు బంకు సమీపంలో వందన ఫుడ్స్ పేరిట బ్రెడ్లు, బన్నులు తయారు చేసే బట్టీ నిర్వహిస్తున్నారు. వారికి మైదాపిండి సరఫరా చేసే స్థానిక కల్లూరు ఎస్టేట్కు చెందిన చలపతి అనే కిరాణా వ్యాపారితో వైరం ఏర్పడింది. వారిపై ఆయన దాడి చేయడంతో చలపతిపై కర్నూలు నాలుగో పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. తర్వాత చలపతి సైతం తనపై హత్యాయత్నం చేశారంటూ బేస్త రఘు, బేస్త రవిపై కోర్టులో ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు 2024, జూన్ 30న నాలుగో పట్టణ పోలీసులు బేస్త రఘు సోదరులపై ఐపీసీ 384, 307 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.కొందరితో గొడవపడ్డారు. ఆ గొడవలో ఇరు వర్గాలకు గాయాలయ్యాయి. దీంతో అప్పటి ఫోర్త్ టౌన్ ఇన్స్పెక్టర్ శంకరయ్య ఇరువురిపై కేసు కట్టారు. దీంతో ఆ కేసులో ఇద్దరు రాజకీ వచ్చారు. దీంతో కేసు దాదాపుగా ముగిసిపోయిందని అప్పటి ఇన్స్పెక్టర్ శంకరయ్య రఘుకు తెలిపాడు. ఆ మేరకు వారు కేసు వ్యవహారం తెగిపోయిందని అనుకున్నారు. అయితే తాజాగా నెల రోజుల క్రితం కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి రఘుకు ఫోన్ చేశారు. 2024 లో మీ పై ఉన్న కేసు ఇంకా పూర్తికాలేదు... ఆ కేసు విషయమై మాట్లాడాలని స్టేషన్ కు రమ్మన్నారు. స్టేషన్ కు వెళ్లిన రఘు అతని సోదరుడు రవి లను ఇన్స్పెక్టర్ మధుసూదన గౌడ్ బెదిరించారు. ఆ కేసు ఇంకా క్లోజ్ కాలేదు.. నేను అనుకుంటే ఆ కేసులో మీకు 20 ఏళ్లు శిక్ష వేస్తానని బెదిరించారు. అలా జరగకూడదు అంటే లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బెస్త రవి తెలిపారు. అయితే తమ వద్ద అంత డబ్బు లేదని ప్రస్తుతానికి రూ.10,000 ఉన్నాయని మిగిలిన డబ్బు తర్వాత ఇస్తామని సీఐ కి చెప్పి బయటకు వచ్చారు. అయితే ఒప్పుకున్న మొత్తం డబ్బు కట్టాల్సిందేనట్టు పోలీసులు బాధితులను వేధించసాగారు. దీంతో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.  లంచం మొత్తం పై ఫోర్త్ టౌన్ పోలీసులతో బేరసారాలు జరిపించారు. బేరసారాలలో పోలీసులు దయ తలచి పదివేలు తగ్గించారు. దీంతో 80 వేల రూపాయలు లంచంగా ఇవ్వాలని ఒప్పందం కుదిరింది. ఆ మేరకు ఆదివారం లంచం ఇస్తానని బాధితుడు పోలీసులకు చెప్పారు. ఆ విషయాలను ఏసీబీ అధికారులు సాక్షయ్యాలుగా రికార్డు చేసుకున్నారు. అదే క్రమంలో ఏసీబీ అధికారులు నిఘా పెట్టి బాధితులతో పాటు లంచం ఇచ్చేందుకు రంగంలోకి దిగారు. ఆ మేరకు హెడ్ కానిస్టేబుల్ రవి లంచం సొమ్ము తీసుకునేందుకు స్థానికంగా ఉన్న హోటల్కు రమ్మన్నాడు. అక్కడకు రాగానే బాధితుని నుంచి లంచం మొత్తం రూ.80000 తీసుకున్నాడు. అప్పటికే కాపుగాసి ఉన్న ఏసీబీ అధికారులు అతనిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, అతని చేతులకు కెమికల్ టెస్ట్ చేసి, నగదు సీజ్ చేశారు. ఆ మేరకు ఆ కేసులో ఏ1 ముద్దాయిగా ఇన్స్పెక్టర్ మధుసూదన్ గౌడ్ ను. ఏ 2 ముద్దాయిగా హెడ్ కానిస్టేబుల్ రవి ను చేర్చి లంచం తీసుకున్నట్లు కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేశారు. ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఏసీబీ కేసులో ట్రాప్ కావడం సంచలనంగా మారింది. కాగా ఈ మధ్యకాలంలో చాలా పోలీస్ స్టేషన్లలో లంచాలు తీసుకోవడం, సివిల్ పంచాయతీలు చేయడం బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు కావడంతో పోలీస్ డిపార్ట్మెంట్ లోనే గాక... పోలీసుల బాధితులలో కూడా కదలిక వచ్చింది. ఏది ఏమైనా ఇలాంటి ఏసీబీ రైడ్లు తరచుగా జరగాలని ప్రజలు నాయకులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల పట్ల ప్రభుత్వం సీరియస్ గా స్పందించాలని వారు కోరుతున్నారు.

ఫోర్‌తో టౌన్ పోలీస్ స్టేషన్ అవినీతికి సూపర్ మార్కెట్ అడ్డా

అనిశా కేసులో ఫిర్యాది బేస్త రఘు మీడియాతో మాట్లాడుతూ నాలుగో పట్టణ పోలీసుస్టేషన్ అవినీతికి సూపర్ మార్కెట్లా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు చేసి వ్యాపారం చేస్తూ కష్టాల్లో ఉన్న తమను తప్పుడు కేసు నెపంతో డబ్బు కోసం వేధించారన్నారు. చివరికి అనిశాను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Tags:

Related Posts