వెలుగోడు లో గణేష్ ఉత్సవ సమితి భక్తుల ధర్నా

వెలుగోడు లో ముదురుతున్న గణేష్ నిమజ్జన వివాదం

వెలుగోడు లో గణేష్ ఉత్సవ సమితి భక్తుల ధర్నా

వెలుగోడు లో గణేష్ నిమజ్జనం వివాదం

 తెల్లవారుజామున గుట్టు చప్పుడు కాకుండా వినాయక నిమజ్జనం చేసిన పోలీసులు

వెలుగోడు పోలీస్ స్టేషన్ వద్ద భక్తుల ధర్నా

నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలంలో శుక్రవారం వినాయక నిమజ్జనం వేడుకలకు ఎస్సీ సామాజిక వర్గంలో మరో వర్గం తమ వీధి నుండి వినాయకుని విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లకుండా అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది శుక్రవారం రాత్రి నుండి జిల్లా అధికారులు మొత్తం వెలుగోడులో ఉండి పరిస్థితి అన్ని చర్యలు తీసుకుంటున్న ఇరువర్గాలు వినాయక నిమజ్జనం విషయంలో రాజీ పడలేదు దీంతో పోలీసులు అధికారులు వినాయక భక్తులు అందరూ వెళ్లిపోయిన తర్వాత తెల్లవారుజామున గుట్టు చప్పుడు కాకుండా వినాయకుని విగ్రహాలను తీసుకొని వెళ్లి నిమజ్జనం చేశారు శనివారం ఉదయం అక్కడికి చేరుకున్న గణేష్ ఉత్సవ సమితి భక్తులు నాయకులు దీంతో ఆందోళన వ్యక్తం చేశారు జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవ సమితి నాయకులు శనివారం ఉదయం వెలుగోడుకు చేరుకుని వేల సంఖ్యలో భక్తులు వెలుగోడు మండలంలో ర్యాలీ చేసి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు కూర్చున్నారు మాకు తెలియకుండా మీరే ఎలా వినాయక విగ్రహాలను తీసుకుని వెళ్లి నిమజ్జనం చేస్తారని పోలీసులను ప్రశ్నిస్తున్నారు వెలుగోడులో ఈ సంఘటనతో ఉద్రిక్త పరిస్థితిలు నెలకొంటున్నాయి జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవ సమితి నాయకులు భక్తులు వెలుగోడు చేరుకుంటుండడంతో అధికారులు ఎలా చర్యలు తీసుకోవాలో తెలియక మల్ల గుల్లలు పడుతున్నారు

Tags:

Related Posts

Advertisement

Latest News

వెలుగోడు లో ముగిసిన వినాయక నిమజ్జనం వివాదం వెలుగోడు లో ముగిసిన వినాయక నిమజ్జనం వివాదం
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలంలో శుక్రవారం నుండి ఈరోజు వరకు కొనసాగుతున్న వినాయకుని నిమజ్జనం వేడుకల వివాదం ముగిసింది పోలీసులు విగ్రహాలను తిరిగి ఇవ్వడంతో...
ఆత్మకూరులో ఆవు హల్చల్
వెలుగోడు లో గణేష్ ఉత్సవ సమితి భక్తుల ధర్నా
వెలుగోడు లో గణేష్ భక్తులపై లాఠీఛార్జ్
వెలుగోడు లో నిరాహార దీక్ష చేపట్టిన గణేష్ భక్తులు
#Draft: Add Your Title
రక్షక భ‌టులే భక్షకబటులు అయ్యారు