చదరంగం జట్టు ఎంపిక పోటీలు ప్రారంభం

IMG-20241020-WA0010
 *నంద్యాల జిల్లా ర్యాపిడ్, బ్లిట్జ్ చదరంగం జట్టు ఎంపిక పోటీలు ప్రారంభం
       నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం క్రాంతి నగర్ లో ఉన్న శ్రీ శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు నంద్యాల జిల్లా రాపిడ్ మరియు బ్లిట్జ్ విభాగాలలో చదరంగం జట్ల ఎంపిక పోటీలు ప్రారంభం అయ్యాయి.
             నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్ ముఖ్య అతిథులుగా పాల్గొని పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ చదరంగం క్రీడ మేధో క్రీడ అన్నారు.ఈ క్రీడ విద్యార్థులలో ఏకాగ్రత పెంచుతుందని,మెదడును పదను పెడుతుందని,సమయస్ఫూర్తి , విజయ కాంక్ష ఇనుమడింప చేస్తుందని అన్నారు. డిసెంబర్ రెండవ వారంలో నంద్యాలలో రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు నిర్వహిస్తున్నామని ప్రకటించారు.లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్ మాట్లాడుతూ నిరంతర సాధన ద్వారా క్రీడలలో విజయాలు సాధించవచ్చన్నారు. క్రీడలలో పాల్గొనడం ద్వారా క్రమశిక్షణ అలవడి విద్యార్థులు చదువులో కూడా రాణించడానికి అవకాశం ఉంటుందన్నారు.
జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎంపికైన  జట్లు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నందు జరగబోవు రాష్ట్రస్థాయి చదరంగం పోటీలలో నంద్యాల జిల్లా తరపున పాల్గొంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 150 మంది క్రీడాకారులు, కోచ్ లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Advertisement

Latest News

మున్సిపాలిటీ రహదారి ధ్వంసం మున్సిపాలిటీ రహదారి ధ్వంసం
మున్సిపల్ రోడ్డు ధ్వంసం వైసిపి కౌన్సిలర్ల హస్తం ఉందంటున్న బాధితులు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వెనక మున్సిపాలిటీకి రోడ్డు కు గిఫ్ట్ డిడ్ గా ఇచ్చిన స్థలాన్ని...
అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఆనంద్
పబ్బతి వేణుగోపాల్ ను సన్మానించిన మంత్రి
సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం పర్యవేక్షణ
వెలుగోడు లో ముగిసిన వినాయక నిమజ్జనం వివాదం
ఆత్మకూరులో ఆవు హల్చల్
వెలుగోడు లో గణేష్ ఉత్సవ సమితి భక్తుల ధర్నా