వసతి గృహాల్లో  ఆహారంలో నాణ్యత లేకపోతే కఠిన చర్యలు తప్పవు

పట్టుదలతో కష్టపడి చదవండి

వసతి గృహాల్లో  ఆహారంలో నాణ్యత లేకపోతే కఠిన చర్యలు తప్పవు

బాల్య వివాహాలు వద్దు:స్థిరత్వం సాధించిన తర్వాతే వివాహాలు చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి

IMG-20260401-WA0823

కర్నూలు, ఏప్రిల్ 01,(రిపబ్లిక్ న్యూస్): వసతి గృహాల్లో  విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత లేకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం గోనెగండ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల వెనుకబడిన సంక్షేమ శాఖ వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో స్టోర్ రూమ్ లో  కూరగాయలు, ఆహారపదార్థాలను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థినులతో ముచ్చటించి, విద్యా బోధన, భోజనం,బాల్య వివాహాలు తదితర  అంశాలపై మాట్లాడారు. విద్యార్థి దశ అనేది జీవితానికి పునాది వంటిదని, ఈ దశలోనే ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన దిశగా కృషి చేస్తే భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవచ్చని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పేర్కొన్నారు. మొదటగా స్టోర్ రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్, కూరగాయల నాణ్యతను పరిశీలించారు. ఎండిపోయిన పచ్చిమిర్చి కనిపించడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆహార పదార్థాల నాణ్యతలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సంబంధిత అధికారులను ఆదేశించారు. వసతి గృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన,  రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.భోజనం, విద్య,వసతి తదితర అంశాలపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేస్తోందని, అధికారులు ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. మెనూ ప్రకారం భోజనం అందుతోందా, ఆహారం నాణ్యత ఎలా ఉంది, సరిపడా  ఇస్తున్నారా అని ఆరా తీశారు. వారానికి ఎన్ని గుడ్లు అందిస్తున్నారు , చిక్కీలు వంటి పోషకాహారం అందుతున్నాయా అనే విషయాలను అడిగి కూడా తెలుసుకున్నారు. త్రాగునీటి వసతి, టాయిలెట్ల పరిశుభ్రత, వసతి గృహంలో ఇతర సౌకర్యాలపై విద్యార్థులను ప్రశ్నించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.. అలాగే బాల్యవివాహాలపై అవగాహన కల్పిస్తూ, ఎక్కడైనా అలాంటివి  గమనించినట్లయితే వెంటనే ఉపాధ్యాయులు లేదా వార్డెన్ కు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు. బాల్య వివాహాలు వద్దని, జీవితంలో  స్థిరత్వం సాధించిన తర్వాతే వివాహం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకోవాలని, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి చదువుపై పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి చదవడం ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని  కలెక్టర్ ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి రాధిక, బిసి వెల్ఫేర్ అధికారి ప్రసూన, ఎంపీడీవో మణి మంజరి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts