సినిమాలు - Praja Republic

'పెద్ది' కోసం 'లెనిన్' విడుదల వాయిదా
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'లెనిన్' సినిమా విడుదల తేదీలో మార్పు జరిగింది. ముందుగా ప్రకటించిన ప్రకారం మే 1న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. కొత్త విడుదల తేదీని కూడా ప్రకటిస్తూ.. జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది.

నమస్కారం, 'లెనిన్' చిత్ర బృందం తరఫున ఈ ప్రకటన చేస్తున్నాం. ముందుగా ప్రకటించిన ప్రకారం మే 1న విడుదల కావాల్సిన మా 'లెనిన్' సినిమాను వాయిదా వేస్తున్నామని తెలియజేస్తున్నాం.

మా ఈ నిర్ణయానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. మా ప్రియమైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి 'పెద్ది' చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో, సినిమా రంగంలో ఒకరికొకరం గౌరవం ఇచ్చుకుంటూ, ఆరోగ్యకరమైన వాతావరణంలో సినిమాలను కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని మేము నమ్ముతున్నాం. రామ్ చరణ్ గారికి, అఖిల్ గారికి మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. అఖిల్ గారికి చరణ్ గారు ఎప్పుడూ మంచి కోరే శ్రేయోభిలాషి. అందుకే, ఎంతో గౌరవంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం.

ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించాలన్నదే మా లక్ష్యం. 'లెనిన్' చిత్రం అన్ని రకాల భావోద్వేగాలతో నిండిన ఒక పర్ఫెక్ట్ సినిమా వేడుకగా ఉంటుందని మీకు హామీ ఇస్తున్నాం. మా బృందం అత్యుత్తమ పనితీరుతో ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకువస్తుంది.

అందుకే, 'లెనిన్' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 2026 జూన్ 26న విడుదల చేయాలని నిర్ణయించాం. మీరు మాపై చూపిస్తున్న ప్రేమకు, అందిస్తున్న మద్దతుకు ఎప్పటికీ రుణపడి ఉంటాం.

ధన్యవాదాలతో,
- టీమ్ లెనిన్ ... అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురళి కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని రకాల భావోద్వేగాలతో కూడిన ఒక సంపూర్ణ సినిమాటిక్ అనుభూతిని 'లెనిన్' అందిస్తుందని, అత్యుత్తమ రూపంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్రబృందం హామీ ఇచ్చింది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.